భార్య పోలీస్ యూనిఫాం గర్ల్‌ఫ్రెండ్‌కు ... డబ్బులు వసూలు చేస్తూ

     Written by : smtv Desk | Sun, Jul 14, 2019, 08:59 PM

భార్య పోలీస్ అధికారి అయితే సదరు భర్తలో కొంత బెరుకు వుంటుంది. ఎందుకంటే అక్రమ సంబంధాల జోలికిపోతే మక్కిలి విరగ్గొడుతుందని. కానీ, ఓ భర్తకు మాత్రం ఆ భయాలేం లేవు. ఎంచక్కా భార్య అధికారాన్ని ఎలా వాడుకోవాలని ఓ పథకం పన్నాడు. తన ప్రియురాలికి పోలీస్ డ్రెస్ వేయించాడు. ఆమెతో డబ్బులు వసూలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. చివరికి బొక్క బోర్లా పడి ఇద్దరూ ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదే‌శ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య పోలీసు శాఖలో ఇన్స్సెక్టర్‌గా పనిచేస్తోంది. సదరు వ్యక్తికి వేరే మహిళతో వివాహేతర సంబంధం వుంది. అయితే భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని అతను లాభపడదాం అనుకున్నాడు.

వెంటనే అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో రంగంలోకి దిగాడు. భార్య యూనిఫాంను గర్ల్ ఫ్రెండ్‌కు తొడిగాడు. ఇంకే వీధుల్లోకి వెళ్లి ఆమె ఎస్సై అని చెప్పి వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఫేక్ ఐడీ కార్డులు కూడా సృష్టించాడు అతడు. వచ్చిన డబ్బుతో ఇద్దురూ జల్సాలు చేసేవారు. అయితే కొన్ని రోజులకే వారి బండారం పోలీసులకు తెలిసింది. వెంటనే నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దొంగ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులద్దరూ ఎవరనే విషయాన్ని పోలీసులు గోప్యంగా వుంచారు.





Untitled Document
Advertisements