మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలకు జలకళ

     Written by : smtv Desk | Sun, Jul 14, 2019, 09:18 PM

మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలకు ఆదివారం జలకళ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఐదు పంపులు తొలిసారి ఒకేసారి గోదావరి నీటిని అన్నారం బ్యారెజ్‌లోకి నీటిని ఎత్తిపోశాయి. అధికారులు ఐదో పంప్ వెట్న్‌న్రు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. దీంతో అన్నారం బ్యారేజ్‌కు నీటి వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి 1, 3, 4, 5, 6 నంబరు పంపుల ద్వారా 11,500 క్యూసెక్కుల నీటిని గ్రావీటి కెనాల్ ద్వారా అన్నారం బ్యారెజ్‌లోకి వదులుతున్నారు. కన్నెపల్లి వద్ద మొత్తం 11 పంపులు ఉన్నాయి. ప్రస్తుతం ఐదు పంపులు నడుస్తున్నాయి. మరో 6 పంపులు వెట్ రన్ చేయాల్సి ఉంది. ఎగువ నుంచి పెద్దగా ప్రవాహాం లేకపోవడంతో ఒక్కో పంపును వెట్ రన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మేడిగడ్డ పూర్తిస్థాయి కెపాసిటీ 16.170 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 6.50 టిఎంసిల నీటి నిల్వ ఉంది. మేడగడ్డ వద్ద 2100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అన్నారం బ్యారెజి పూర్తిస్థాయి నీటి సామర్థం 10.87 టిఎంసిలు కాగా ప్రస్తుతం 3.64 టిఎంసిల నిల్వ ఉంది. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచిఐదు పంప్‌లు 24 గంటలు నిరంతరాయంగా నీటిని వదిలిలే నడిస్తే ఒక టిఎంసి నీటికి సరిపోతాయని ఇంజనీర్లు తెలిపారు. అన్నారం బ్యారెజి వద్ద 8680 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మొత్తం గోదావరి ఇన్‌ఫ్లో 13,100 క్యూసెక్కులుగా ఉంది.





Untitled Document
Advertisements