యాభై ఏళ్లలో కన్నడంలో డబ్బింగైనా రెండో సినిమా రంగస్థలం

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 09:17 AM

రంగస్థలం సినిమా తెలుగులో సూపర్ హిట్టైంది. తెలుగులో తప్పా మరేభాషలోనే డబ్బింగ్ చేయలేదు. తెలుగులోనే ఈ మూవీ రూ. 120 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సాధించింది. సుకుమార్ దర్శకత్వంతో పాటు, రామ్ చరణ్ తనదైన శైలిలో నటించడంతో సినిమా సూపర్ హిట్ కొట్టింది.

పక్కా పల్లెటూరి సినిమా కావడంతో మాస్ కు బాగా నచ్చింది. చాలాకాలం తరువాత ఈ మూవీని కన్నడంలో డబ్బింగ్ చేశారు. అక్కడ ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది. మాములుగా కన్నడంలో ఇతర భాషల సినిమాలను డబ్బింగ్ చేయరు. డబ్బింగ్ చేయకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. గత యాభై ఏళ్లలో కన్నడంలో డబ్బింగైనా రెండో సినిమా రంగస్థలం కావడం విశేషం. కన్నడంలో వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.





Untitled Document
Advertisements