‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్‌లుక్

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 06:56 PM

ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేసింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తుండగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్‌లో నానితో పాటు నలుగురు మహిళలు, ఓ పాప కనిపించారు. నాని వెనకాల నిల్చున్న వారందరి చేతుల్లో బైనాక్యులర్‌ వుంటుంది. బెనాక్యులర్లు అడ్డుగా వుండటంతో వారి ముఖాలు పోల్చుకోవడం కష్టంగా వుంది. ‘బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..’ అని నాని వారి పాత్రలను ట్విటర్‌‌‌లో పరిచయం చేశాడు. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది.

అనిరుధ్‌ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘హలో’ సినిమా తర్వాత విక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. ఈ చిత్రం మొదటి పాటను జులై 18న, టీజర్‌ను జులై 24న విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో నటిస్తూనే నాని ‘వి’ చిత్రంలో నటిస్తున్నాడు. తనను హీరోగా తెరకు పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్వకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సుధీర్‌బాబు, నివేధా థామస్‌, అదితిరావు హైదరిలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా దిల్‌రాజు నిర్మిస్తున్నారు.





Untitled Document
Advertisements