చంద్రగ్రహణం ఎఫెక్ట్: నేటి సాయంత్రం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

     Written by : smtv Desk | Tue, Jul 16, 2019, 01:03 PM

చంద్రగ్రహణం ఎఫెక్ట్: నేటి సాయంత్రం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

నేటి సాయంత్రం ఏడు గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. నేటి అర్ధరాత్రి దాటాక (బుధవారం వేకువజామున) 1:31 నుంచి 4:29 గంటల వరకు చంద్రగ్రహణ ఘడియలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేయనున్న అధికారులు.. తిరిగి రేపు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచి శుద్ధి చేస్తారు. అనంతరం ఆణివార ఆస్థానం పూర్తిచేసి 11 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తారు.

మరోవైపు, చంద్రగ్రహణం కారణంగా నేటి సాయంత్రం నుంచి పలు ఆలయాలు మూతపడనున్నాయి. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాలు కూడా మూసివేయనున్నారు. రేపు ఉదయం ఆలయాలను తెరిచి సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.





Untitled Document
Advertisements