SRHకు కొత్త కోచ్!

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 05:54 PM

SRHకు కొత్త కోచ్!

ప్రపంచకప్ సాధించిన ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా ఉన్న ట్రేవర్ బేలిస్ కు ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ యాజమాన్యం ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సన్ రైజర్స్ ప్రధాన కోచ్‌గా ఆయనను నియమించింది. ఇంగ్లాండ్‌కు ప్రపంచ కప్ అందించిన కోచ్ ట్రేవర్ బేలిస్‌ను సన్‌రైజర్స్ జట్టు హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పత్రికా ప్రకటనను పోస్ట్ చేసింది. బేలిస్ ఇదివరకే ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టుకు రెండు ట్రోఫీలు అందించిన విషయం తెలిసిందే. ఆయన కోచింగ్‌లోనే సిడ్నీ సిక్సర్స్ జట్టు ఛాంపియన్స్ లీగ్, బిగ్ బాష్ లీగ్ లాంటి కీలకమైన ట్వంటీ20 టోర్నీలలో ఛాంపియన్‌గా నిలిచింది. ఎన్నో విజయాలు అందించిన సక్సెస్ ఫుల్ కోచ్ నైపుణ్యంపై తమకు నమ్మకం ఉందని, హైదరాబాద్ జట్టును మరింత ముందుకు తీసుకెళ్తారని సన్ రైజర్స్ ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ కోచ్‌గా సేవలు అందించిన టామ్ మూడీకి మేనేజ్‌మెంట్ ధన్యవాదాలు తెలిపింది. గత 7 ఐపీఎల్ సీజన్లలో 5 పర్యాయాలు సన్ రైజర్స్ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేరింది. టామ్ మూడీ కోచింగ్‌లోనే 2016 సీజన్లో తమ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచిందని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఆయన కెరీర్ మరింత విజయవంతంగా సాగాలని సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్ ఆకాంక్షించింది.





Untitled Document
Advertisements