ICJ : భారత్ కు మద్దతుగా 15 మంది, పాక్ కు ఒక్కరు!

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 06:08 PM

ICJ : భారత్ కు మద్దతుగా 15 మంది, పాక్ కు ఒక్కరు!

ఇస్లామాబాద్: భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ ‌జాదవ్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం మరణశిక్షను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను నిలుపుదల చేయాలంటూ ఐసీజే ఆదేశించింది. తీర్పును పునఃసమీక్షించాలని తెలిపింది. 16 మంది జడ్జిల ప్యానల్‌లో 15 మంది భారత్ వాదనలకు అనుకూలంగా ఓటేయగా.. ఒక్కరు పాక్‌కు ఓటేశారు. అయితే ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ కేసులో ఐసీజే తీర్పు తమకు అనుకూలమన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. జాదవ్‌ను విడుదల చేయొద్దని.. భారత్‌కు అప్పగించొద్దంటూ తీర్పు ఇవ్వడంపై ఐసీజేకు కృతజ్ఞతలు తెలిపారు. పాక్ ప్రజలకు వ్యతిరేకంగా జాదవ్ నేరాలకు పాల్పడ్డాడన్నారు. చట్టం ప్రకారం తాము వ్యవహరిస్తామన్నారు.





Untitled Document
Advertisements