ప్రభుత్వరంగ ఫార్మాకంపెనీలకు 330.35 కోట్ల నిధులు!

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 06:41 PM

ప్రభుత్వరంగ ఫార్మాకంపెనీలకు 330.35 కోట్ల నిధులు!

భారత ప్రభుత్వ రంగ ఫార్మాకంపెనీలకు కేంద్రం 330.35 కోట్ల నిధులను అందజేయాలని నిర్ణయించింది. నిధులసమస్యతో సతమతం ఫార్మాకంపెనీలకు ఈ నిర్ణయంతో కాస్త ఊరట లభించింది. ఇక ఈ నిధులతో ఉద్యోగుల వేతన బకాయిలను చెల్లించాలనినిర్ణయించింది. మంత్రివర్గ ప్యానెల్‌ ఒకటి ఇందుకోసం ఏర్పాటుచేసి ఈ నాలుగు ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడమా లేక వాటా విక్రయమా అన్నది నివేదికను కోరాలని నిర్ణయించింది. లేదంటే ఈ నాలుగుసంస్థలను శాశ్వతంగా మూసివేయాలా అన్న నిర్ణయానికి వస్తుంది. ప్రధాని అధ్యక్షతన రిగిన కేబినెట్‌ కమిటీ రుణం రూపంలో 330.35 కోట్లు మంజూరుచేసింది. వీటిలో ఐడిపిఎల్‌, రాజస్థాన్‌డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాక్యూటికల్స్‌, హిందూస్థాన్‌యాంటిబయాటిక్స్‌ సంస్థలున్నాయి.బడ్టెరీ మద్దతు 330.35 కోట్లుగా ఉంటుంది. ఈ మొత్తం పూర్తిగా సిబ్బంది జీతాలను చెల్లించడంతోపాటుఐ డిపిఎల్‌, ఆర్‌డిపిఎల్‌, హాల్‌లలో స్వఛ్ఛంద పదవీవిరమణకు వినియోగిస్తారు. ఇక ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూమాత్మక వాటా, లేక మూసివేత అంశాన్ని అధ్యయనంచేసి నిర్ణయించేందుకు కేబినెట్‌ ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. అంతేకాకుండా గత కేబినెట్‌ కమిటీల్లో తీసుకున్న నిర్ణయాలనుసైతం ఈ కమిటీ పరిశీలనచేస్తుంది. వీటిని విక్రయించడమా లేక బకాయిలు క్లియరెన్స్‌ ప్రతిపాదనలపైనా అధ్యయనంచేస్తుంది. అంతకుముందు 2016 డిసెంబరు 28వ తేదీ ఐడిపిఎల్‌, ఆర్‌డిపిఎల్‌లను మూసివేయాలని, హిందూస్థాన్‌ యాంటి బయాటిక్స్‌, బిసిపిఎల్‌ కంపెనీలను వ్యూహాత్మక వాటా విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఇపుడు కొత్తగా ఏర్పాటుచేస్తున్న కేబినెట్‌సబ్‌కమిటీ వీటినిసైతం పరిశీలనచేస్తుంది.అలాగే ఈ నాలుగుసంస్థల్లో మిగులు భూములను విక్రయించాలని, బహిరంగ వేలంలోనే ప్రభుత్వ ఏజెన్సీలకు విక్రయించి కంపెనీల రుణాలను తీర్చాలనినిర్ణయించింది. అప్పులు తీర్చినతర్వాత ఐడిపిఎల్‌, ఆర్‌డిపిఎల్‌ను మైసివేయాలని, యాంటిబయాటిక్స్‌, బిసిపిఎల్‌ సంస్థలను వ్యూహాత్మక విక్రయానికి పెట్టాలనినిర్ణయించారు. ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఇందుకు సంబంధించి గత ఏడాది జూన్‌ 14వ తేదీ సమగ్ర మార్గదర్శకాలను జారీచేసింది. కొన్ని ప్రభుత్వరంగసంస్థల్లోని ఉద్యోగులకు ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదు. మరికొందరిని విఆర్‌ఎస్‌ స్కీం కింద పంపించాలనినిర్ణయించింది. వీటికోసం కూడా మిగులు స్థలాలను వేలంలో విక్రయించాలనినిర్ణయించింది.వీటన్నిటంనీ పరిష్కరించుకునేందుకు బడ్జెట్‌లో రుణం రూపేణా మూడు సంస్థలకు 330.35 కోట్లు రుణంగా ఇవ్వాలని నిర్ణయించింది. 158 కోట్ల రూపాయలు వేతనాల చెల్లింపులకు 172 కోట్లు విఆర్‌ఎస్‌ మొత్తాలను చెల్లించేందుకు వినియోగిస్తుంది. అంతేకాకుండా ఇపుడు కేబినెట్‌ నియమించనున్న మంత్రుల సబ్‌కమిటీ ఈ నాలుగుసంస్థల్లోని మిగులు భూములను ప్రభుత్వసంస్థలకు బహిరంగ వేలంలో విక్రయించి అన్ని బకాయిలను క్లియర్‌చేసుకోవాలని కేంద్ర కేబినెట్‌నిర్ణయించింది.





Untitled Document
Advertisements