అంతర్జాతీయ వేదికపై మెరిసిన తెలంగాణ ఆణిముత్యం!

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 06:54 PM

అంతర్జాతీయ వేదికపై మెరిసిన తెలంగాణ ఆణిముత్యం!

తెలంగాణ ఆణిముత్యం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. తాజాగా చైనాలోని షాంఘైలో జరిగిన చలనచిత్రోత్సంలో అవార్డు కొట్టేసిన ఆచార్య వేణు ఆ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాటోగ్రాఫర్‌గా నిలిచాడు. ప్రతిభ ఉంటే ఆలస్యంగానైనా గుర్తింపు దక్కుతుందనడానికి వేణు తాజా ఉదాహరణ.వేణు పనిచేసిన తొలి చిత్రానికే ఈ అవార్డు రావడం విశేషం. మేఘాలయలో షూటింగ్ జరుపుకున్న గారో భాషా చిత్రం ‘మా. అమా’కుగాను అతనికి ఈ అవార్డు దక్కింది. సినిమాటోగ్రఫీ విభాగంలో 15 చిత్రాలను వెనక్కి నెట్టేసి అవార్డును కైవసం చేసుకుంది. కేవలం రూ. 8 లక్షల బడ్జెట్, పరిమిత వనరులతోనే వేణు ఆ చిత్రాన్ని దృశ్యకావ్యంగా మలిచాడు. మనసుకు హత్తుకునే ప్రకృతి దృశ్యాలను, మానవ భావోద్వేగాలను అద్భుతంగా పరిచయం చేశాడు. క్లోజప్, లాంగ్ షాట్లు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. రాజయ్యపల్లిలో జన్మించిన వేణు పదోతరగతి చదువుతున్నప్పుడు సినిమాటోగ్రాఫర్ కావాలని కలగన్నాడు. చిన్నప్పటి డ్రాయింగులు, పెయింటింగులు వేస్తుండేవాడు. తర్వాత హైదరాబాద్ జేఎన్‌టీయూ ఫైనార్ట్స్ కాలేజీలో ఫొటోగ్రఫీ కోర్సు చేశాడు. తర్వత కోల్ కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ‘మా. అమా’ దర్శకుడు డొమినిక్ సంగ్మా వేణు సహాధ్యాయి. సినీరంగంలోకి రాకముందు వేణు కొన్ని యాడ్స్, ఫ్యాషన్, స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం పనిచేశాడు. మా అమా సినిమా తర్వాత టాలీవుడ్ హిట్ మూవీ ‘జెర్సీ’ రెండో యూనిట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అది క్రికెట్ తో సంబంధమున్న మూవీ కావడంతో సీన్ల కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని వేణు చెప్పాడు. జెర్సీలో అతడు చిత్రీకరించిన సన్నివేశాలు ప్రముఖ దర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మరో తెలుగు సినిమాలో బిజీగా ఉన్న వేణుకు అరుణాచల్ ప్రదేశ్, శ్రీలంక నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.





Untitled Document
Advertisements