శాంసంగ్ ' Galaxy A80' లాంచ్...కెమరా సూపర్!

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 08:05 PM

శాంసంగ్ ' Galaxy A80' లాంచ్...కెమరా సూపర్!

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ' Galaxy A80' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను గురువారం (జులై 18న) భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఉన్న మరో విశేషమేమిటంటే.. ఇందులోని 48 మెగాపిక్సల్స్ ' రొటేటింగ్ కెమెరా'నే. ఫోన్ వెనుక భాగంలో ఈ రొటేటింగ్ కెమెరాను అమర్చారు. దీంతో ఇదే కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు. ఈ కొత్త ఫోన్‌ను 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజీతో తీసుకొచ్చారు. ఏంజల్ గోల్డ్, గోస్ట్ వైట్, పాంథమ్ బ్యాక్ వేరియంట్లలో ఈ కొత్త ఫోన్ వినియోగదారులను అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ నోకియా 9 ప్యూర్ వ్యూ, వన్‌ప్లస్ 7 ప్రొ, ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ స్మార్ట్‌ఫోన్లకు దేశీయంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Galaxy A80 ధరను రూ.47,990 నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రీ బుకింగ్ జులై 22 నుంచి ప్రారంభం కానుంది. జులై 31 వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 1 నుంచి ఫోన్ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. అన్ని ప్రధాన మొబైల్ స్టోర్లలోనూ, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలోనూ, శాంసంగ్ ఒపెరా హౌస్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన ఆన్‌లైన్ దుకాణాల్లో ఈ ఫోన్లు లభ్యంకానున్నాయి. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొనుగోలుపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నారు. ఫీచర్లు:::6.7 అంగుళాల డిస్‌ప్లే ,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్ ,ఆండ్రాయిడ్ 9.0 పై ,8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ ,48, 8 మెగాపిక్సల్ రొటేటింగ్ కెమెరాలు ,ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ ,యూఎస్‌బీ టైప్-సి ,డాల్బీ అట్మోస్ , 3700 ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ చార్జింగ్).

Untitled Document
Advertisements