అదరగొడుతున్న 'రాక్షసుడు' ట్రైలర్!!

     Written by : smtv Desk | Fri, Jul 19, 2019, 11:04 AM

అదరగొడుతున్న 'రాక్షసుడు' ట్రైలర్!!

బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పటి నుంచో మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. నటన, డాన్సుల పరంగా మంచి మార్కులు వేయించుకుంటున్న శ్రీనివాస్ కు విజయం దూరంగానే ఉంటుంది. ఈ సారి గురితప్పకుండా తమిళ సూపర్ హిట్ చిత్రం రాక్షసన్ రీమేక్ తో వస్తున్నాడు.తమిళంలో విష్ణు విశాల్ హీరోగా నటించాడు. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా ఈ చిత్రం తమిళనాట ఘనవిజయం సాధించింది. తెలుగు వర్షన్ కు రమేష్ వర్మ దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ ఆకట్టుకునే నటన కనబరుస్తున్నాడు.

'నేనంటే భయానికి భయం' అంటూ బ్యాగ్రౌండ్ లో వినిపిస్తున్న విలన్ వాయిస్సినిమాపై ఉత్కంఠ పెంచుతోంది. మనం వెతుకుతున్న వాడు రేపిస్టో, కిడ్నాపరో లేకపోతే వన్ సైడ్ లవరో కాదు.. పథకం ప్రకారం హత్యలు చేసే ఒక మతి స్థిమితం లేని వ్యక్తి అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు లో రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

Untitled Document
Advertisements