బీజేపీలో చేరిన సినీ, టీవీ నటులు!!

     Written by : smtv Desk | Fri, Jul 19, 2019, 11:26 AM

బీజేపీలో చేరిన సినీ, టీవీ నటులు!!

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పలువురు సినీ, టీవీ నటులు గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ నేతృత్వంలో ఢిల్లీలో వీరంతా కాషాయ కండువా కప్పుకున్నారు. పర్నోమిత్ర, రిషి కౌషిక్, కాంచన మొయిత్ర, రూపంజన మిత్ర, బిశ్వజిత్ గంగూలీ తదితర మొత్తం 12 మంది నటీనటులు బీజేపీలో చేరారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమయ్యే బీజేపీలో చేరినట్టు ఈ సందర్భంగా నటులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అధికార టీఎంసీ సహా కాంగ్రెస్, సీపీఎం నేతలు బీజేపీలోకి క్యూకట్టారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ గణనీయమైన స్థానాలు సాధించిన తర్వాత వలసలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను 18 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.

Untitled Document
Advertisements