చైనాలో ఇసుక వైద్యంకు విపరీత ఆకర్షణ!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 01:20 PM

చైనాలో ఇసుక వైద్యంకు విపరీత ఆకర్షణ!

చైనా: చైనాలో ఇసుక వైద్యం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. చైనా వాయవ్య ప్రాంతంలోని జిన్‌జియాంగ్‌ ఉయిగుర్‌ స్వయంపాలిత ప్రాంతంలోని తుర్పాన్‌ పట్టణంలో ఏటా జూన్‌ నెల నుండి ఆగస్టు చివరి వరకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్షియస్‌ వరకు పెరుగుతాయి. ఈ ప్రాంతంలో ఇసుక మేటలున్న భూముల్లో ఉష్ణోగ్రతలు 70 డిగ్రీల వరకు చేరే అవకాశం వుంది. అందువల్ల ఇసుక వైద్యానికి ఇది ఉత్తమ సమయంగా భావిస్తున్న పర్యాటకులు ఈ ప్రాంతానికి పోటెత్తుతున్నారు. ఇసుక వైద్యానికి అవసరమైన వనరులు ఇక్కడ పుష్కలంగా వుండటం వల్ల ఈ పట్టణానికి 'శాండ్‌ థెరపీ టౌన్‌' అన్న పేరు వచ్చింది. ఏటా మూడు లక్షల మందికి పైగా పర్యాటకులు సందర్శిస్తున్న ఈ ప్రాంతం గౌచాంగ్‌ జిల్లా యాయెర్‌ పట్టణానికి సమీపంలో వుంది.





Untitled Document
Advertisements