ఇంగ్లాండ్‌‌ జట్టుకు డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ ఛాంపియన్‌ బెల్ట్‌

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 01:57 PM

ఇంగ్లాండ్‌‌ జట్టుకు డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ ఛాంపియన్‌ బెల్ట్‌

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ ట్రిపుల్‌ హెచ్‌ ప్రపంచకప్‌ గెలిచి తొలిసారి క్రికెట్‌ ఛాంపియన్‌గా అవతరించిన ఇంగ్లాండ్‌‌ జట్టుకు సర్‌ప్రైజ్‌ చేశాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ ఛాంపియన్‌ బెల్ట్‌ను ఇంగ్లాండ్‌ జట్టుకు అంకితం చేశాడు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా ఇయాన్‌మోర్గాన్‌ సేనకు అభినందనలు తెలిపారు. 'ఇదో అత్యద్భుతమైన టోర్నమెంట్‌, చూడచక్కని ఫైనల్‌ మ్యాచ్‌. ఛాంపియన్‌గా అవతరించడానికి అన్ని అర్హతలు కలిగిన జట్టు. ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు అభినందనలు. ఈ సందర్భంగా డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ ఛాంపియన్‌ బెల్ట్‌ మీకోసమే' అని ట్వీట్‌ చేశాడు.గత ఆదివారం లార్డ్స్‌ మైదానం వేదికగా జరిగిన ఆసక్తికర వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ ఉత్కంఠపోరులో రెండు జట్లూ సూపర్‌ ఓవర్‌లోనూ సమాన స్కోర్‌ సాధించడంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ విజేతగా అవతరించింది. ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌(84 నాటౌట్‌) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements