భారతీయ యూజర్ల కోసం Netflix స్పెషల్ ఆఫర్

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 02:08 PM

భారతీయ యూజర్ల కోసం Netflix స్పెషల్ ఆఫర్

నెట్ ఫ్లిక్ష్ తాజాగా తన వినియోగదారుల కోసం మరో కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. మొబైల్ ఓన్లీ ప్లాన్ ఆఫర్ ను భారతీయ యూజర్ల కోసం ప్రత్యేకించి అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసు మిగతా ఓటీటీ ప్లాట్ ఫాంలతో పోలిస్తే ఇండియాలో ఎంతో ఖరీదైనది. ప్రస్తుతం.. నెట్ ఫ్లిక్స్ మూడు నెలల ప్లాన్స్ రూ.500, రూ.800 రీఛార్జ్ లపై ఆఫర్ చేస్తోంది. కాస్ట్ ఎక్కువగా ఉండటంతో నెట్ ఫ్లిక్స్ సబ్ స్ర్కిప్షన్ అయ్యేందుకు యూజర్లు వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. అందుకే నెట్ ఫ్లిక్స్ మొబైల్ యూజర్లను ఆకర్షించేందుకు మొబైల్ mobile-only plan పేరుతో కొత్త ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ పొందాలంటే యూజర్లు నెలకు రూ.250తో రీఛార్జ్ చేయించుకుంటే చాలు.. నెట్ ఫ్లిక్స్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసును నెలపాటు ఎంజాయ్ చేయొచ్చు. 2019 మార్చిలోనే వీడియో స్ట్రీమింగ్ పాయినీర్ ఇండియాలో మొబైల్ డివైజ్ ల్లో నెలవారీ సబ్ స్క్రిప్షన్ రూ.250 (3.63 డాలర్లు)పై టెస్టింగ్ నిర్వహించింది. ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటా ప్లాన్స్ అందిస్తున్న తరుణంలో నెట్ ఫ్లిక్స్ కూడా తమ యూజర్ల కోసం చీపెస్ట్ ఆఫర్లను అందించాలని నిర్ణయించింది. 'ఈ ప్లాన్ పై ఎంతో విశ్వాసంతో ఉన్నాం. ఇండియాలో భారీ సంఖ్యలో యూజర్లను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. దేశ మార్కెట్ లో మా బిజినెస్ ను క్రమంగా విస్తరిస్తాం. ఆ తర్వాత Pay TV ARPUపై దృష్టిసారిస్తాం' అని కంపెనీ తెలిపింది. హాట్ స్టార్ కంపెనీ కూడా నెలకు రూ.299రీఛార్జ్ పై AT,T ఇంక్ HBO నుంచి కంటెంట్ ఆఫర్ చేస్తోంది. Live Sports స్ట్రీమ్స్ కూడా అందిస్తోంది. అమెజాన్ బండెల్స్ కూడా వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులను ప్రైమ్ మెంబర్ షిప్ తో అందిస్తోంది. నెట్ ఫ్లిక్స్ సర్వీసులో క్రైమ్ థ్రిల్లర్ వంటి స్కేరడ్ గేమ్స్ అందిస్తోంది. ఢిల్లీ క్రైమ్ తరహాలో బాలీవుడ్ నటులతో బ్లాక్ బస్టర్ టీవీ షోలను అందిస్తోంది. స్కేరడ్ గేమ్స్ సెకండ్ సీజన్ కూడా ఆగస్టులో రిలీజ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది.





Untitled Document
Advertisements