డిప్లొమేటిక్ పాస్ పోర్టును అందుకున్న ఏపీ సీఎం జగన్!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 02:10 PM

డిప్లొమేటిక్ పాస్ పోర్టును అందుకున్న ఏపీ సీఎం జగన్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు డిప్లోమేటిక్ పాస్ పోర్టును అందుకున్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి విజయవాడ పాస్ పోర్టు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన జగన్ తన డిప్లోమేటిక్ పాస్ పోర్టును తీసుకున్నారు. భారత విదేశాంగ శాఖ సాధారణంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పార్లమెంటు సభ్యులకు డిప్లొమేటిక్ పాస్ పోర్టులను జారీచేస్తుంది. అలాగే విదేశాల్లో పనిచేసే భారత దౌత్య సిబ్బంది, వారి కుటుంబీకులకూ ఈ పాస్ పోర్టును ఇస్తుంది. దీనివల్ల సాధారణ పౌరుల తరహాలో తనిఖీలు లేకుండా సులువుగా రాకపోకలు సాగించవచ్చు. వీరంతా పదవులు లేదా ఉద్యోగాల నుంచి తప్పుకున్నాక తమ డిప్లొమేటిక్ పాస్ పోర్టును వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.





Untitled Document
Advertisements