తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం... వృద్ధులకు ప్రత్యేక దర్శనం

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 02:19 PM

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం... వృద్ధులకు ప్రత్యేక దర్శనం

శ్రీవారి దర్శనాన్ని సాధారణ భక్తులకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో పలు నిర్ణయాలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. ఇకపై సాధారణ రోజుల్లో స్వామి దర్శనానికి వచ్చే వృద్ధులు, చిన్నారులతోపాటు వచ్చే తల్లిదండ్రులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని ఈనెల 23వ తేదీ మంగళవారం నుంచి అమల్లోకి తేనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం 10 గంటల స్లాట్‌లో వెయ్యి, మధ్యాహ్నం 2 గంటల స్లాట్‌లో 2 వేలు, మూడు గంటల స్లాట్‌లో మరో వెయ్యి టోకెన్లు వీరికోసం ప్రత్యేకంగా జారీ చేస్తారు.

65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు, దివ్యాంగులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన టోకెన్లు ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్లలో ఇస్తారు. ఇప్పటివరకు సాధారణ రోజుల్లో ఏడాదిలోపు చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులకు మాత్రమే ఈ అవకాశం లభిస్తోంది. భక్తుల కోరిక మేరకు చిన్నారుల వయసు పరిమితిని ఐదేళ్లకు పెంచారు.





Untitled Document
Advertisements