ఆర్మీ రెజిమెంట్‌లో సేవలకు ధోని!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 04:28 PM

ఆర్మీ రెజిమెంట్‌లో సేవలకు ధోని!

రిటైర్మెంట్ గురించి వార్తల్లో సంచలనంగా మారిన మహేంద్ర సింగ్ ధోని ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. కరేబియన్ పర్యటనకు తాను అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ ప్రకటించడం లేదన్నాడు. రెండు నెలలపాటు ఆర్మీ రెజిమెంట్‌లో పని చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారొకరు వెల్లడించారు. పారాచూట్ రెజిమెంట్‌లో ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా పని చేస్తోన్న సంగతి తెలిసిందే. ధోనీ రిటైర్ కావడం లేదు, ఇంతకు ముందు ఇచ్చిన మాట ప్రకారం రెండు నెలలు సైన్యంతో కలిసి పని చేయబోతున్నాడు. మహీ నిర్ణయాన్ని కెప్టెన్ కోహ్లి సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు తెలియజేశామని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు. విండీస్ పర్యటన నుంచి ధోనీ తప్పుకోవడంతో అతడి స్థానంలో మూడు ఫార్మాట్లలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. లేదంటే టెస్టుల్లో సాహాకు అవకాశం ఇవ్వొచ్చు. ఆగష్టు 3న విండీస్‌తో భారత్ తొలి టీ20 ఆడనుంది. కరేబియన్ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు వన్డేల్లో టీమిండియా తలపడనుంది.





Untitled Document
Advertisements