గంటలోనే 5 కోట్ల రుణం!

     Written by : smtv Desk | Tue, Aug 13, 2019, 03:51 PM

గంటలోనే 5 కోట్ల రుణం!

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అనేక రకాల సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్‌బీఐ రూ.లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు టర్మ్ లేదా వర్కింగ్ క్యాపిటల్ రుణాలను కస్టమర్లకు అందిస్తోంది. కంపెనీ లేదా వ్యక్తి ఈ లోన్స్ తీసుకోవచ్చు. అయితే ఈ రుణం కోసం జీఎస్‌టీఐఎన్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ వివరాలు అసవరం అవుతాయి. ఈ డాక్యుమెంట్లు లేకపోతే మీకు రుణం రాదు. జీఎస్‌టీఐఎన్, ఐటీఆఱ్ కలిగిన ఎవరైనాసరే రూ. లక్ష నుంచి రూ. 5 కోట్ల వరకు బిజినెస్/వర్కింగ్ క్యాపిటల్/టర్మ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లింక్‌పై క్లిక్ చేసి https://www.psbloansin59minutes.com/sbi లోన్‌కు అప్లై చేయొచ్చు. లేదంటే www.psbloansin59minutes.com పోర్టల్‌కు వెళ్లి కూడా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పైన పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేసి పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి సమాచారం సాయంతో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత అవసరమైన వివరాలు అందించి 59 నిమిషాల్లోనే బిజినెస్ లోన్స్ పొందొచ్చు. రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఫీజు ఉండదు. బ్యాంక్ స్టేట్‌మెంట్, జీఎస్‌టీ, ఐటీఆర్ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తే లోన్ ప్రక్రియ వేగతంతమౌతుంది. ఐటీఆర్, బ్యాంకింగ్ వివరాలు లేకపోతే లోన్ పొందటం కష్టం. \





Untitled Document
Advertisements