కాశ్మీర్ చర్చకు మధ్యవర్తిగా ట్రంప్...యూటర్న్!

     Written by : smtv Desk | Tue, Aug 13, 2019, 06:40 PM

కాశ్మీర్ చర్చకు మధ్యవర్తిగా ట్రంప్...యూటర్న్!

జమ్ముకాశ్మీర్ వివాదంపై మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్దమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించే ఎలాంటి ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టంగా చెప్పారని అమెరికాలో భారత రాయబారి హర్ష్ వర్దన్ శ్రింగ్లా తెలిపారు. ఇండియాపాకిస్థాన్ లు చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యను పరిష్ఖరించుకోవాలని దశాబ్దాల నాటి అమెరికా పాత పాలసీ చెబుతోందని… మధ్యవర్తిత్వం వహించాలనేది ఆ పాలసీలో లేదని అన్నారు. మధ్యవర్తిత్వానికి తాము ఒప్పుకోబోమని భారత్ స్పష్టం చేయడంతో… మధ్యవర్తిత్వం వహించే ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టం చేశారని తెలిపారు. లాహోర్ డిక్లరేషన్, సిమ్లా ఒప్పందం మేరకు ఇరు దేశాలు కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ చెప్పారని హర్ష్ వర్దన్ శ్రింగ్లా అన్నారు. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పర్యటనలో భాగంగా అమెరికాకు వెళ్ళి వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అయితే అప్పుడు ఇమ్రాన్ కశ్మీర్ సమస్యను లేవనెత్తాడు. ఇద్దరు నేతలు కలిసి మీడియాతో మాట్లాడుతుండగా.. 70 ఏళ్లుగా సాగుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి ట్రంప్ మధ్యవర్తిత్వం కోరుతున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒకే చెబుతూ... పనిలో పనిగా రెండు వారాల క్రితం భారత ప్రధాని మోదీని కలిశాను. ఆయన కూడా దీని గురించే చర్చించారు.. అని ఇమ్రాన్‌కు చెప్పాడు. మీరు మధ్యవర్తిత్వం వహిస్తారా? సమస్యను పరిష్కరిస్తారా? అని మోదీ నన్ను అడిగాడు. ఎక్కడంటే.. కశ్మీర్ అంశం గురించి అన్నాడు. ఇద్దరూ కోరుకుంటున్నారు కాబట్టి.. నేను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ భరోసా ఇచ్చేశాడు. మీరు ఈ పని చేసి పెడితే.. వంద కోట్ల మందికిపైగా ఊరట చెందుతారు అని ఇమ్రాన్ బదులిచ్చాడు.





Untitled Document
Advertisements