తెరపైకి SheToo...ప్రముఖ గాయనిపై లైంగిక ఆరోపణలు చేసిన నటుడు

     Written by : smtv Desk | Tue, Aug 13, 2019, 09:09 PM

తెరపైకి SheToo...ప్రముఖ గాయనిపై లైంగిక ఆరోపణలు చేసిన నటుడు

మీటూ గురుంచి అందరికి తెలిసే ఉంటుంది కదా. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉద్యమం మీటూ. దీని హవా కాస్త నెమ్మదించిన తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్, నటుడు జోష్ క్లోస్.. ప్రముఖ గాయని క్యాటీ పెర్రీపై చేసిన ఆరోపణలు వైరల్‌గా మారాయి. 2010లో తాను క్యాటీ పెర్రీతో కలిసి ‘టీనేజ్ డ్రీమ్’ మ్యూజిక్ వీడియో చేశానని క్లోస్ తెలిపాడు. ఓ రోజు తమ స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్లామని, అక్కడ ఆమె తన అనుమతి లేకుండా ఫ్యాంట్ లాగేసి మర్మాంగాన్ని అందరికీ చూపించి హేళన చేసిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. ‘‘నా స్నేహితుడు క్యాటి పెర్రీకి అభిమాని. ఆమెను కలవాలని ఉందని చెబితే.. నేను అతడిని పట్టుకుని కస్ట్యూమ్ డిజైనర్ పుట్టిన రోజు వేడుకకు వెళ్లాను. అక్కడ పెర్రీకి నా స్నేహితుడిని పరిచయం చేస్తుంటే.. అకస్మాత్తుగా ఆమె నా ఫ్యాంట్, లోదుస్తులను కిందికి లాగేసి నా మర్మాంగాన్ని తన ఫ్రెండ్స్‌కు, జనాలకు చూపించింది. ఆమె చేసిన పనికి నాకెంతో బాధ వేసింది’’ అని తెలిపాడు. ‘‘నేను అప్పుడప్పుడే తెరపైకి వచ్చాను. ఆమె నాతో అలా ప్రవర్తించే సమయానికి ‘టీనేజ్ డ్రీమ్’ మ్యూజిక్ వీడియో పూర్తయ్యింది. అప్పట్లో నేను అంత స్ట్రాంగ్ కాదు. ఆర్థికంగా కూడా బలంగా లేను. పైగా ఆమె అప్పటికే పాపులర్ అయిన గాయని. తనకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా తెగించలేకపోయాను. కానీ, ఇప్పుడు నాకంటూ ఒక ఇమేజ్, స్టేటస్ సంపాదించాను. ఈ సమాజంలో మగవాళ్లను శక్తివంతులు, వికృతమైన వ్యక్తులుగా భావిస్తారు. కానీ, శక్తివంతమైన మహిళ ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తుందే చెప్పేందుకే ఈ విషయాన్ని బయటపెట్టాను’’ అని తెలిపాడు. ‘టీనేజ్ డ్రీమ్’ మ్యూజిక్ వీడియో చిత్రీకరణ సందర్భంగా ఆమెను కలిసినప్పుడు చాలా కూల్‌గా, మంచిగా కనిపించింది. షూటింగ్ మొదలైన రోజు నుంచి ముద్దులు పెడుతూ సెట్‌లో తనలో కోరికలు కలిగేలా చేసేదని క్లోస్ చెప్పాడు.‘‘అప్పుడు నేను ఆమెకు ఎదురు చెప్పలేకపోయాను. నా తల్లిదండ్రులు ఈ సీన్లు చూసి చిరాకు పడతారని తెలిసినా డబ్బులు కోసం చేయాల్సి వచ్చింది’’ అని తెలిపాడు. ‘‘మొదటి రోజు షూటింగ్ పూర్తయిన తర్వాత ఆమె నన్ను శాంతా బర్బరాలోని ‘స్ట్రిప్ క్లబ్’కు ఆహ్వానించింది. అయితే, నేను రానని చెప్పేశాను. ఈ ఆరోపణలు నేను డబ్బు కోసమే చేస్తున్నానని అనుకుంటే పొరపాటు. ఆ ఉద్దేశమే ఉంటే.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆరోజుల్లోనే ఈ విషయాన్ని బయటపెట్టి సొమ్ము చేసుకునేవాడిని. ఇప్పుడు నాకు డబ్బుతో అవసరం లేదు. కానీ, నా అనుభవం.. ఇతర మగాళ్లకైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా’’ అని తెలిపాడు. అయితే, క్లోస్ ఆరోపణలపై పెర్రీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. క్లోస్ ఆరోపణలతో మరింత మంది పురుషులు #SheToo పేరుతో తన అనుభవాలను పంచుకోడానికి సిద్ధమవుతున్నారు. అయితే, #MeToo తరహాలో #SheToo కూడా వైరలయ్యే అవకాశాలు తక్కువే.






Untitled Document
Advertisements