లైఫ్ స్టై‌ల్లో మార్పులు...శృంగార జీవితంపై ఎఫెక్ట్

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 12:46 PM

లైఫ్ స్టై‌ల్లో మార్పులు...శృంగార జీవితంపై ఎఫెక్ట్

మారుతున్న జీవనశైలి ప్రభావం శృంగార జీవితంపై పడుతోంది. విపరీతమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా ఆరోగ్యం దెబ్బతినడంతో దాని ఎఫెక్ట్ సెక్స్‌ లైఫ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది అని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా భాగస్వామితో శృంగారంలో పాల్గొంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినప్పటికీ.. ఒత్తిడి, అలసట కారణంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. చాలా మంది మైగ్రెయిన్‌తో బాధపడుతుంటారు. ఇలాంటి వారిలో అంగస్తంభన సమస్యలు తలెత్తే ముప్పు ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. స్త్రీల లైంగిక హార్మోయిన్ అయిన ఈస్ట్రోజన్ స్థాయిలు అధికంగా, పురుష లైంగిక హర్మోయిన్ అయిన టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయనడానికి మైగ్రెయిన్ సూచిక. తీవ్రమైన తలనొప్పి, వాంతి వచ్చినట్టు ఉండటం లాంటివి లక్షణాలు ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిలో కనిపిస్తాయి. కానీ మగాళ్లలో 15 మందిలో ఒకరికి మాత్రమే ఈ లక్షణాలుంటాయి. దీనికి ఈస్ట్రోజన్ కారణమైనప్పటికీ.. అది ఏ మేరకు అని తెలుసుకోవడానికి లోతుగా పరిశోధనలు జరగుతున్నాయి





Untitled Document
Advertisements