బ్రేకింగ్ .. సైరా లో పవన్ కళ్యాణ్? ...

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 12:54 PM

ఈ రోజు మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “సైరా నరసింహా రెడ్డి” మేకింగ్ వీడియో విడుదల కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.ఎంతో మంది అగ్ర తారాగణంతో నిండిన ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.ఇన్ని అంచనాలు ఉన్న సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగాభిమానులు ఎంతలా ఎదురు చూసారో వారికే తెలుసు.

ఇప్పుడు ఆ అభిమానులు అందరికి ఊహించని సర్పైజ్ రాబోతుంది.ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరు తమ్ముడు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొంతు కలిపారు.ఈ రోజు విడుదలకు సిద్ధంగా ఉన్న “సైరా” మేకింగ్ వీడియోకు పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు అంతర్గత సమాచారం.అసలే పవన్ అభిమానులు పవన్ రాజకీయాలకు పరిమితం అయ్యిపోయారని కాస్త నిరాశతో ఉన్నారు.ఇప్పుడు అలంటి వారికి మరియు మొత్తం మెగాభిమానులకు ఈ న్యూస్ మాత్రం ఖచ్చితంగా కిక్కిస్తుందని చెప్పాలి.పవన్ వాయిస్ దెబ్బతో యూట్యూబ్ రికార్డ్స్ ఏమన్నా షేక్ అవుతాయో లేదో చూడాలి.ఈ మేకింగ్ వీడియో ఈ రోజు సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు విడుదల కానుంది.





Untitled Document
Advertisements