ఈ చిట్కాలతో గురకను దూరం చేసుకోండి

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 12:56 PM

ఈ చిట్కాలతో గురకను దూరం చేసుకోండి

చాలా మంది నిద్రపోతున్నప్పుడు వస్తున్న గురకతో ఇబ్బందిపడుతుంటారు. వారేమో కాని పక్కన నిద్రిస్తున్న వారికి మాత్రం నరకమే. అయితే ఎంత ప్రయత్నం చేసినా గురక మానేయడం చాలా కష్టం. అంత సులువుగా అది విడిచి వెళ్ళదు. తాజా అధ్యయనం ప్రకారం ఈ చిట్కాలతో గురకను దూరం చేసుకోవచ్చంట. గురక అనేది సాధారణమైన సమస్యగా మారింది. పెద్దల్లో దాదాపు 45 శాతం మంది గురక బారిన పడుతున్నారు. గురకను తగ్గించడానికి ఈ హోం రెమెడీస్ ఉపయోగపడతాయి.యాలకుల పొడితో గురకను నివారించొచ్చు. ఒక గ్లాసు వెచ్చటి నీరు తీసుకోవాలి. అందులో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కలపాలి. బాగా కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల గురక తగ్గుతుంది.గురక స్లిప్ అప్నియా అనే రుగ్మతకు సూచిక కావచ్చు. స్లీప్ అప్నియా వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.గురక రావడానికి పొగతాగే అలవాటు కూడా ఓ కారణమే. పొగతాగే వారిలో శ్వాస మార్గం వాచిపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది.పడుకున్నప్పుడు ఒక్కోసారి నాలుక వెనక్కి వెళ్లి గొంతులో అవరోధంగా మారొచ్చు. తల కింద దిండు ఉంచుకోవడం వల్ల దీన్ని నివారించొచ్చు. శ్వాస మార్గానికి ఆటంకం కలగకుండా చూడొచ్చు.అధిక బరువు వల్ల గురక వచ్చే అవకాశం ఉంది. గొంతులో అధికంగా ఉండే కణజాలం వల్ల గురక సమస్య ఎక్కువ అవుతుంది.గురక రావడానికి పొడి గాలి కూడా ఓ కారణం. పొడిగాలి వల్ల నాసిక పొరలు, గొంతు పొడిబారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. హ్యుమిడిఫయర్‌‌తో ఈ సమస్యను పరిష్కరించొచ్చు.గురకను నివారించడానికి రాత్రిపూట ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి. ఆల్కహాల్ వల్ల నాలుక, గొంతులోని కణజాలం రిలాక్స్ అవుతుంది. ఫలితంగా శ్వాస మార్గానికి ఆటంకం ఏర్పడి అది గురకకు దారి తీస్తుంది.నాలుక, గొంతులోని కండరాలు దృఢంగా ఉండేలా చూసుకోవాలి. ఈ కండరాలు బలంగా ఉండటం వల్ల గురక సమస్య తగ్గుతుంది.ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసపై నియంత్రణ లభిస్తుంది. గురకతోపాటు నిద్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.పసుపు పాలు గురకను తగ్గిస్తాయి. ఒక కప్పు వెచ్చని పాలలో రెండు టేబుల్ స్పూన్ల పసుపు కలపి తాగాలి. రోజూ నిద్రకు ఉపక్రమించడానికి ముందు పసుపు పాలు తాగడం ప్రయోజనకరం.





Untitled Document
Advertisements