దుమ్ము లేపుతున్న 'సైరా' మేకింగ్ వీడియో

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 04:01 PM

చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' రూపొందుతోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో మెగాస్టార్ అమితాబ్ కీలకమైన పాత్రను పోషించారు. కొద్దీ సేపటి క్రితం ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఈ మేకింగ్ వీడియో చూసాక సదరు మెగా అభిమానులు హిట్ పక్కా అని అంటున్నారు . భారీ బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే ఆయా భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగులో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.





Untitled Document
Advertisements