29 ఏళ్ల క్రితం ఆగస్టు 14న సచిన్ ఫస్ట్ సెంచరీ

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 04:05 PM

29 ఏళ్ల క్రితం ఆగస్టు 14న సచిన్ ఫస్ట్ సెంచరీ

భారత జట్టు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు ఆగస్టు 14 ఎంతో ప్రత్యేకమైన రోజు. సచిన్ తన కెరీర్‌లో 100 సెంచరీలు చేసినా.. సరిగ్గా 29 సంవత్సరాల క్రితం తొలి సెంచరీని ఆగస్టు 14నే బాదాడు. అప్పుడు సచిన్ వయసు 17 ఏళ్లు. మాంచెస్టర్ వేదికగా 1990లో జరిగిన భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సచిన్‌ తొలి సారిగా మూడంకెల స్కోరుని సాధించాడు. దీంతో ఆగస్టు 14 సచిన్‌కు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులే చేసిన సచిన్.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 119 పరుగులు చేశాడు. 408 పరుగుల లక్ష్య ఛేదనలో 109 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును అద్భుత ఆటతో ఆదుకున్నాడు. ఇక 183 పరుగుల వద్ద కపిల్ దేవ్ పెవిలియన్ చేరడంతో.. ఇంగ్లాండ్ తమ విజయం ఖాయం అనుకుంది. ఈ సమయంలో మనోజ్ ప్రభాకర్‌తో కలిసి ఏడవ వికెట్‌కు సచిన్ 160 పరుగులు జోడించడంతో 343/6తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. దీంతో భారత్‌ ఆ టెస్టును డ్రాగా ముగించింది. ఆస్ట్రేలియా మరో దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌కు కూడా ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. 52 టెస్టులు ఆడిన బ్రాడ్‌మన్‌ 99.94 సగటుతో 6996 పరుగులు చేసాడు. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి. బ్రాడ్‌మన్‌ చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్‌ పట్టింది ఆగస్టు 14నే. 1948 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌తో బ్రాడ్‌మన్‌ కెరీర్‌ను ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిచింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కూడా బ్రాడ్‌మన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.





Untitled Document
Advertisements