ప్రేమించి మోసం చేసిన యువతి...కోర్టులో దావా వేసిన ప్రేమికుడు!

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 06:18 PM

ప్రేమించి మోసం చేసిన యువతి...కోర్టులో దావా వేసిన ప్రేమికుడు!

ప్రేమ పేరుతో అబ్బాయిలే అమ్మాయిలను మోసం చేస్తారని అనేక మంది అంటారు. అలాగే వార్తల్లో కూడా ఎక్కువగా అమ్మాయిని అబ్బాయి మోసం చేశాడనే చెప్తారు. కాని అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తూ వారిని పిచ్చోల్లను చేస్తుంటారు. అయితే ఈ సంఘటనలో ఎవరు ఎవర్ని మోసం చేశారో తెలుసుకోవడం కష్టమే. ఎందుకు అంటే ఒకసారి మీరే చదవండి... ఇండోనేషియాలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అల్ఫ్రీదస్ అరియాంటో అనే వ్యక్తి ఫ్రాన్సిస్కా నోనా లీన్ అనే యువతిని ప్రేమించాడు. దీంతో ఇద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఇటీవల లీన్ అతడికి బ్రేకప్ చెప్పింది. దీంతో అతడు తను ఆమెకు ఖర్చుపెట్టిన మొత్తం తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు ఆమె ససేమీరా అంది. వేరేదారి లేక అరియాంటో కోర్టులో దావా వేశాడు. రూ.19,96,610 లక్షలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఒక వేళ ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకున్నట్లయితే.. ఆ మొత్తానికి పదింతలు ఎక్కువ చెల్లించాలన్నాడు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. ఇది కోర్టుకు రావల్సిన విషయం కాదని, ఏమైనా ఉంటే బయట తేల్చుకోండని తెలిపారు. ఈ సందర్భంగా అరియాంటో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఆమెతో డేటింగ్‌కు అంగీకరించడానికి ముందే కొన్ని షరతులు విధించాను. తనని వదిలేస్తే ఆమెపై ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగి ఇవ్వాలని, ఎవరైనా పెళ్లి చేసుకుంటే దానికి పది రెట్లు ఇవ్వాలని ఫోన్లో చెప్పాను. దీనికి అంగీకరించిన తర్వాతే ఆమెతో డేటింగ్ మొదలుపెట్టా’’ అని అన్నాడు. ఈ దావాపై లీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను కూడా అరియాంటో మీద దావా వేయనున్నట్లు తెలిపింది. డేటింగ్‌లో భాగంగా అతడు తన ఇంటికి వచ్చి నీళ్లు తాగేవాడని, వాటికి డబ్బులు వసూలు చేస్తానని అంటోంది. అయితే, ఇప్పటివరకు ఈ కథలో ఆ అమ్మాయే విలన్‌గా కనిపించింది కదూ. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే.. లీన్‌తో డేటింగ్‌కు ముందే అరియాంటోకు వేరే అమ్మాయితో పెళ్లయిపోంది. ఒకరితో కాదు.. ఇద్దరితో. ఈ విషయం ఆలస్యంగా తెలవడంతో లీన్ అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. అయితే, అరియాంటోకు మాత్రం ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో లీన్‌తో దాదాపు సంసారం చేసేశాడు. ఆమె విడిపోదాం అని చెప్పగానే.. అప్పటివరకు పెట్టిన ఖర్చులు గుర్తొచ్చాయి. ఇందులో ఎవరు ఎవరిని మోసం చేసారో తెలీక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.





Untitled Document
Advertisements