72 రూల్ గురుంచి విన్నారా...ఇన్వెస్ట్ చేసిన డబ్బు రెట్టింపు

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 06:43 PM

72 రూల్ గురుంచి విన్నారా...ఇన్వెస్ట్ చేసిన డబ్బు రెట్టింపు

చేతిలో ఉన్న డబ్బుతో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తూ వడ్డీ రూపంలో సంపాదించాలని భావిస్తారు. అయితే ఇలాంటి వారు డబ్బును స్థిర ఆదాయం ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో వీరికి రాబడితోపాటు రక్షణ ఉంటుంది. ఇలా స్థిర వడ్డీ రేటు లభించే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టిన డబ్బు ఎంత కాలానికి రెట్టింపు అవుతోంది సులభంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ 72 రూల్ ఒకటింది. మీ డబ్బు ఎంత కాలానికి రెట్టింపు అవుతుందో ఈ నిబంధన చెప్పేస్తుంది. అయితే ఇక్కడ వార్షిక వడ్డీ రేటు స్థిరంగా ఉండాలి. ఇన్వెస్టర్లు ఈ రూల్ ప్రకారమే వారి డబ్బు ఎంత కాలానికి రెట్టింపు అవుతోంది సూచనప్రాయంగా లెక్కగడతారు. ఇది చాలా సుభలం 72ను వడ్డీ రేటుతో భాగిస్తే వచ్చే మొత్తం.. మీ డబ్బు ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో చెప్పేస్తుంది. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై మీకు 7 శాతం వడ్డీ రేటు లభిస్తే దాదాపు 11 ఏళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుందని అర్ధం చేసుకోవాలి.





Untitled Document
Advertisements