ఎస్ఎస్‌సీలో 1350 పోస్టులు...నోటిఫికేషన్ రిలీజ్

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 07:51 PM

ఎస్ఎస్‌సీలో 1350 పోస్టులు...నోటిఫికేషన్ రిలీజ్

కేంద్ర ప్రభుత్వ స‌ర్వీసుల్లో వివిధ విభాగాల్లో సెల‌క్షన్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పది, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* సెల‌క్షన్ పోస్టులు (ఫేజ్-7/ 2019).
ఖాళీల సంఖ్య: 1350.
అర్హత‌: పోస్టుల వారీగా పోస్టుల‌ను అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ, ఇత‌ర ఉన్నత విద్యార్హత‌లు.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఎంపిక‌ విధానం: రాత‌ప‌రీక్ష, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వారా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది 31.08.2019.
ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది(ఆన్‌లైన్) 02.09.2019 (సాయంత్రం 5 గంటల వరకు).
ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది 02.09.2019 (సాయంత్రం 5 గంటల వరకు).
ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది(ఆఫ్‌లైన్): 04.09.2019 (సాయంత్రం 5 గంటల వరకు).
రాతపరీక్ష 14.10.2019 - 18.10.2019.





Untitled Document
Advertisements