డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆర్‌బీఐ శుభవార్త

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 12:02 PM

డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆర్‌బీఐ శుభవార్త

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఓ తీపి కబురు చెప్పింది. క్యాష్ విత్‌డ్రా చేసుకునే వారు ఏటీఎంకు వెళ్లి పిన్, అమౌంట్, అన్ని ఎంటర్ చేశాక కొన్ని సమయాల్లో డబ్బులు లేవు అని చెప్తుంది. దీంతో మీకు ఒక ఉచిత ఏటీఎం లావాదేవీ అయిపోయినట్లే. కానీ ఇప్పుడు ఏటీఎంలో డబ్బులు రాకపోతే మీ లావాదేవీ కౌంట్ కాదు. ఇకపోతే బ్యాంకులు నెలకు కొన్ని ఏటీఎం క్యాష్ విత్‌డ్రా లావాదేవీలను ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాకుండా, ఏటీఎం పిన్ తప్పుగా ఎంటర్‌చేసినా కూడా ఆ లావాదేవీ ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్‌కు కౌంట్ కాదని ఆర్‌ఐబీ స్పష్టం చేసింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్స్ అంశాలు, క్యాష్ లేకపోవడం, పిన్ తప్పుగా ఎంటర్ చేయడం వంటి వాటిని ఏటీఎం లావాదేవీ కిందకు పరిగణలోకి తీసుకోకూడదని బ్యాంకులను ఆదేశించింది. అలాగే బ్యాలెన్స్ విచారణ, చెక్ బుక్ రిక్వెస్ట్, ట్యాక్స్ పేమెంట్, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ వంటి వాటిని కూడా ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కిందకు తీసుకోకూడదని తెలియజేసింది. దీంతో బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలుగునుంది. ఇకపై ఏటీఎంలో డబ్బు రాకపోతే ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్ లిమిట్ అలాగే ఉంటుంది.





Untitled Document
Advertisements