పంత్ ఇకనైనా ఆటతీరు మార్చుకో!

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 12:17 PM

పంత్ ఇకనైనా ఆటతీరు మార్చుకో!

భారత జట్టు యువ క్రికెటర్ రిషబ్ పంత్ పై నెటిజన్లు మళ్ళీ ట్రోల్ల్స్ మొదలుపెట్టారు. వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా బుధవారం అర్ధరాత్రి ముగిసిన ఆఖరి వన్డేలో.. ఎదుర్కొన్న తొలి బంతికే రిషబ్ పంత్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. నెం.4లో నిర్లక్ష్యంగా ఆడింది చాలు.. ఇకనైనా ఆటతీరు మార్చుకోవాలని పంత్‌కి అభిమానులు సూచిస్తున్నారు. స్పిన్నర్ అలెన్ విసిరిన బంతిని క్రీజు వెలుపలికి వచ్చి హిట్ చేసేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాడ్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి మిడాఫ్‌లో గాల్లోకి లేచింది. దీంతో.. ఫీల్డర్ కీమోపాల్ సులువుగా క్యాచ్ అందుకున్నాడు. రెండో వన్డేలోనూ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో వికెట్లపైకి నేరుగా వచ్చిన బంతికి ఆడేందుకు అడ్డంగా బ్యాట్ ఊపేసిన పంత్ క్లీన్‌బౌల్డయిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో 255 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు.. రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చే సమయానికి 12.2 ఓవర్లలో 91/2తో ఉంది. ఈ దశలో ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించాల్సిన పంత్.. తొందరపడి ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ చేజార్చుకున్నాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (65: 41 బంతుల్లో 3x4, 5x6) మెరుపు అర్ధశతకంతో కెప్టెన్ విరాట్ కోహ్లి (114 నాటౌట్: 99 బంతుల్లో 14x4)కి చక్కటి సహకారం అందించాడు. ఐదో వికెట్‌కి శతక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. అలవోకగా భారత్ జట్టుకి 256/4తో విజయాన్ని అందించింది.





Untitled Document
Advertisements