ఇండియా, చైనా ఇక వర్ధమాన దేశాలు కావు!

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 01:14 PM

ఇండియా, చైనా ఇక వర్ధమాన దేశాలు కావు!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా, చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా, చైనా ఇక వర్ధమాన దేశాలు కావని, కాని ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ) నుంచి పొందిన ఆ పేరుతో ప్రయోజనాలు’ పొందుతున్నాయని ఆక్షేపించారు. ‘అమెరికా ప్రయోజనాలే మొదట’ అనే విధానాన్ని బలంగా వినిపిస్తున్న ట్రంప్ అమెరికా వస్తువులపై భారతదేశం విధిస్తున్న భారీ సంపకాలను తీవ్రంగా వ్యతిరేకించడమే కాక భారత్‌ను సుంకాల రాజు’ గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే. అసలు వర్ధమాన దేశాలను ఎలా నిర్వచిస్తారంటూ గత జులైలో డబ్ల్యుటిఓను ప్రశ్నించిన ట్రంప్ భారత్, చైనా, టర్కీ ప్రపంచ వాణిజ్య నిబంధనల కింద అధిక ప్రయోజనాలు పొందడాన్ని వ్యతిరేకించారు. మంగళవారం పెన్‌సిల్వేనియాలో ఒక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఆసియా ఖండంలో అతి పెద్ద ఆర్థిక శక్తులైన భారత్, చైనా ఇక ఎంతమాత్రం వర్ధమాన దేశాలు కాదని, అవి డబ్ల్యుటిఓ నుంచి ప్రయోజనాలు పొందరాదని అన్నారు. అయితే ఆ రెండు ప్రయోజనాలు పొందుతూనే ఉన్నాయని, దీంతో అమెరికా ఆర్థికంగా దెబ్బతింటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రెండు మా నుంచి ఎన్నో ఏళ్లుగా లాభపడుతూనే ఉన్నాయంటూ ఆయన విమర్శించారు. తమ పట్ల న్యాయబద్ధంగా డబ్లుటిఓ వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్, చైనా వంటి దేశాలు ఎదుగుతూనే ఉన్నాయి .అయితే అవి ఎదిగిపోయాయి. అటువంటి దేశాలు డబ్లుటిఓ నుంచి ప్రయోజనాలు పొందడానికి అమెరికా అనుమతించదు. ఇక అందుకు మేము అనుమతించం..మేము తప్ప అందరూ ఎదుగుతున్నారు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements