రాష్ట్ర మహిళలకు రక్షాబంధన్ కానుక...ఫ్రీ బస్

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 03:12 PM

రాష్ట్ర మహిళలకు రక్షాబంధన్ కానుక...ఫ్రీ బస్

దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే అక్టోబర్ 29 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఢిల్లీ మెట్రోల్లో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటును కల్పిస్తామని రెండు నెలల క్రితం చేసిన ప్రకటన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో రాష్ట్రంలోని మహిళందరూ ఉచితంగా ప్రయాణించొచ్చని పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీ వాసులకు ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పిస్తామంటూ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి పౌరుడికి 15 జీబీ డేటా ద్వారా ఉచిత ఇంటర్నెట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రానున్న మూడు లేదా నాలుగు నెలల్లో మొదటి విడతలో భాగంగా నగర వ్యాప్తంగా కనీసం 11 వేల వైఫై హాట్‌స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 70 అసెంబ్లీ కేంద్రాల్లో ఒక్కోదాంట్లో 1000 హాట్‌స్పాట్లతోపాటు బస్ స్టేషన్‌లలో మరో 4000 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.





Untitled Document
Advertisements