విరాట్ కోహ్లీ రికార్డ్స్ ...

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 03:32 PM

టీమిండియా కెప్టెన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు.. వెస్టిండీస్‌ టూర్‌లో వరుస సెంచరీలతో రికార్డులు బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇక, వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో సెంచరీ బాదిన టీమిండియ కెప్టెన్... మరి కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ పదేళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై ఉన్న రికార్డును బద్దలు కొట్టి.. ఈ దశాబ్దంలో 20,018 పరుగులు చేశాడు. కాగా, పాంటింగ్‌ 18,962 పరుగులతో దశాబ్దంలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో రెండో స్థానంలోకి పడిపోయాడు. పాంటింగ్‌ తర్వాత జాక్వెస్ కలిస్‌ 16,777 పరుగులతో, జయవర్ధనే 16,304 పరుగులతో.. కుమార సంగక్కర 15,999 పరుగులతో.. సచిన్‌ తెందూల్కర్‌ 15,962 పరుగులతో వరుసగా ఆ జాబితో ఉన్నారు.
వన్డే క్రికెట్‌లో 50 పరుగుల కంటే అధికంగా ఎక్కువసార్లు పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్‌ 463 వన్డేల్లో 145 సార్లు 50 పరుగులకు మించి స్కోర్ చేస్తే.. కోహ్లీ 239 మ్యాచుల్లోనే 97 సార్లు 50కి పైగా పరుగులు చేశారు. ఇక ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా సచిన్ రికార్డు సమం చేశాడు కోహ్లీ.. ఆసీస్‌పై సచిన్ 9 సెంచరీలు చేస్తే.. వెస్టిండీస్‌పై 9 సెంచరీలు సాధించాడు టీమిండియా కెప్టెన్. మరోవైపు వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో 21 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పట్టి వరకు ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ 22 సెంచరీలతో టాప్‌స్పాట్‌లో ఉన్నాడు.





Untitled Document
Advertisements