పన్ను చెల్లింపుదారులకు ఆగస్ట్ 31 డెడ్‌లైన్‌

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 03:57 PM

పన్ను చెల్లింపుదారులకు ఆగస్ట్ 31 డెడ్‌లైన్‌

పన్ను చెల్లింపుదారులకు ఆగస్ట్ 31 డెడ్‌లైన్‌. ఈ తేదీలోపు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయాలి. లేదంటే ఆదాయపు పన్ను శాఖ మీపై భారీగా పెనాల్టీ విధిస్తుంది. పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ చాలా గడవు ఇచ్చింది. ఐటీ డిపార్ట్‌మెంట్ గత కొన్నేళ్లుగా ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగిస్తు వస్తోంది. కంపెనీల నుంచి అవసరమైన డాక్యుమెంట్లు లభించని వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. ట్యాక్స్ ఫైలింగ్‌కు గడువు 2019 ఆగస్ట్ 30. పన్ను చెల్లింపుదారులు అంతా ఈ నిర్దేశిత గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయాలి. లేదంటే ఐటీ డిపార్ట్‌మెంట్ రూ.10,000 వరకు చార్జీలు విధిస్తుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న ట్యాక్స్‌పేయర్స్‌కు రూ.1,000 పెనాల్టీ పడుతుంది. అదే రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉంటే రూ.5,000 జరిమానా చెల్లించాలి. 2019 డిసెంబర్ 31లోపు ఐటీఆర్ దాఖలు చేస్తే ఈ చార్జీలు వర్తిస్తాయి. అదే డిసెంబర్ 31 తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే.. రూ.10,000 పెనాల్టీ పడుతుంది. ఇక్కడ మీ ఆదాయం ఎంతనే దానితో సంబంధం ఉండదు. ఎవరికైనా రూ.10 వేల జరిమానా తప్పదు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గతంలో ఐటీఆర్ ఫైలింగ్ గడువును 2019 జూలై 31 నుంచి ఆగస్ట్ 31కి పొడిగించింది. 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరానికి పన్నుచెల్లింపుదారులు ఆగస్ట్ 31లోపు ఐటీఆర్ దాఖలు చేయాలి.





Untitled Document
Advertisements