కోహ్లీ బొటనవేలికి గాయం...అభిమానుల్లో ఆందోళన

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 04:03 PM

కోహ్లీ బొటనవేలికి గాయం...అభిమానుల్లో ఆందోళన

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బుధవారం అర్ధరాత్రి ముగిసిన మూడో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా కుడిచేతి బొటనవేలికి గాయమైంది. ఫాస్ట్ బౌలర్ కీమర్ రోచ్ విసిరిన బౌన్సర్‌ని ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లీ.. బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో వేగంగా వచ్చిన బంతి అతని కుడిచేతి బొటనవేలిని బలంగా తాకడంతో నొప్పితో ఈ భారత కెప్టెన్ విలవిలలాడిపోయాడు. కోహ్లీ పరిస్థితిని గమనించిన టీమిండియా ఫిజియో మైదానంలోకి వచ్చి.. ప్రథమ చికిత్సతో కెప్టెన్‌కి నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించాడు. వాస్తవానికి చికిత్స జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ నొప్పితో విలవిలలాడిన తీరు చూస్తే..? అతను బ్యాటింగ్‌‌ని కొనసాగించడమో..? అని అంతా భావించారు. కానీ.. నొప్పిని పంటి బిగువున భరించిన విరాట్ కోహ్లి (114 నాటౌట్: 99 బంతుల్లో 14x4) అజేయ శతకంతో భారత్ జట్టుని గెలిపించాడు. అయితే.. ఈనెల 22 నుంచి వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభకానున్న నేపథ్యంలో కోహ్లీ గాయంపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. బొటన వేలి గాయంపై తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ‘గాయం అంత తీవ్రంగా ఏమీ లేదు. ఒకవేళ బొటన వేలి ఎముకకి ఏదైనా గాయమై ఉండింటే..? బ్యాటింగ్‌ కొనసాగించేవాడ్ని కాదు’ అని వెల్లడించాడు. వరల్డ్‌కప్‌లో 445 పరుగులు చేసినా.. కనీసం ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. విండీస్‌తో వన్డే సిరీస్‌లో వరుసగా రెండు శతకాలు బాదేశాడు.





Untitled Document
Advertisements