ఆవు పాల కన్నా బొద్దింక పాలే నయం

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 04:19 PM

ఆవు పాల కన్నా బొద్దింక పాలే నయం

బొద్దింక పాలు పాలు ఎప్పుడైనా తాగారా?. ఈ పాల వల్ల ఆవు పాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ శక్తి లభిస్తుంది. పసిఫిక్ బీటిల్ అనే బొద్దింక గుడ్లు పెట్టకుండా.. పిల్లల్ని కని పాలిస్తుంది. ఇవి భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, హవాయి, చైనా, మయన్మార్ దేశాల్లో కనిపిస్తాయి. ఈ పాలు మంచి పౌష్టికాహారమని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. శరీరానికి కావాల్సిన ఆవశ్యక ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఈ బొద్దింక పాలలో విరివిగా లభిస్తాయట. అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది సూపర్ ఫుడ్ అని అభివర్ణిస్తున్నారు. భవిష్యుత్తులో ఆహార కొరతను అధిగమించడానికి ఈ బొద్దింక పాలు ఉపయోగపడతాయనే దిశగానూ పరిశోధకులు ఆలోచనలు చేస్తున్నారు. ఆ పాలను తీయడం ఎలాగో తెలుసా..? ఆ పాలను తీయడం కోసం బొద్దింకను చంపేయాల్సిందే. పది బొద్దింకలను చంపితే వచ్చేది ఎంతో తెలుసా? కేవలం 0.5 మిల్లీ లీటర్ పాలు మాత్రమే. మరి లీటర్ల కొద్దీ పాలు కావాలంటే ఎన్ని బొద్దింకలను చంపాలో ఆలోచించండి. అందుకే ఈ బొద్దింక పాలతో ప్రపంచ ఆకలి తీర్చడం అనేది అనుమానాస్పదంగా మారింది. మన ఆకలి తీర్చడం కోసం వేలాది జీవుల్ని చంపడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.





Untitled Document
Advertisements