ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 05:07 PM

ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత

బాలీవుడ్ సీనియర్ నటి విద్యా సిన్హా (71) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తులు, గుండె సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె జులై 10న ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతూ తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. పతి పత్ని ఔర్ వొ, రజ్నిగంధా, ఛోటి సి బాత్ వంటి హిట్ సినిమాలలో ఆమె నటించారు. సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్ సినిమాలో విద్య నటించారు. కావ్యాంజలి టెలివిజన్ సీరియల్‌లో ఏక్తా కపూర్‌తో కలిసి నటించారు. 1968లో నటుడు వెంకటేశ్వరన్ ను ఆమె పెళ్లి చేసుకుంది. వెంకటేశ్వరన్ 1996లో మరణించిన తరువాత 2001లో భీమ్ రావు సులేంఖ్‌ను విద్యా సిన్హా రెండో పెళ్లి చేసుకుంది. 2009లో రెండో భర్తతో ఆమె విడాకులు తీసుకున్నారు. రెండో భర్తపై గృహ హింస కేసు పెట్టారు.





Untitled Document
Advertisements