ఐస్‌‌తోనూ బరువు తగ్గొచ్చు!

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 05:19 PM

ఐస్‌‌తోనూ బరువు తగ్గొచ్చు!

ఐస్ థెరపీ గురించి ఎప్పుడైనా విన్నారా. బరువు తగ్గడానికి, చర్మం బిగుతుగా మారడానికి ఈ థెరపీ దోహదం చేస్తుంది. బరువు ఎక్కువగా ఉన్న, చర్మం సాగినట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఐస్‌‌ను ఉంచి మృదువుగా రుద్దడమే ఐస్ థెరపీ. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోయతాయి. చర్మం బిగుతుగా మారుతుంది. ఐస్ థెరపీ వల్ల సాగినట్టుగా ఉండే చర్మం సాధారణ స్థితికి వస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ థెరపీని 2000 సంవత్సరంలో మెక్సికోలో ప్రారంభించారు. మంచి ఆహారం తీసుకుంటూ, ఎక్సర్‌సైజ్ చేయడంతోపాటు ఐస్‌తో మసాజ్ చేయడం వల్ల శరీరంలో కోరుకున్న మార్పు వేగంగా వస్తుంది. ఐస్‌ క్యూబ్‌లను బ్యాగ్‌లో లేదా మందమైన గుడ్డలో వేసి కొవ్వు పేరుకుపోయిన పొట్ట భాగంలో మసాజ్ చేయొచ్చు. చర్మం బిగుతుగా మారడం కోసం బాలింతలు ఐస్ మసాజ్‌ చేయడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది. ప్రసవం తర్వాత వారి చర్మం త్వరగా సాధారణ స్థితికి రావడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. తరచుగా ఐస్ థెరపీ చేయడం వల్ల సత్ఫలితాలు పొందొచ్చు.





Untitled Document
Advertisements