జెండా వందనం కూడా సరిగా చేయించలేక పోతున్నారా ....!

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 06:22 PM

ఈరోజు భారత దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, మన దేశం మన జెండా అనే నినాదం తలకెత్తుకుని ఆరోజుల్లో మనకంటూ ఒక జెండా ఉండాలని భావించి ఈ జెండా రూపకల్పన చేశారు అప్పటి మన నేతలు. ప్రతి ఏడాది ఈరోజున జెండా ఎగురవేసి, దానికి గౌరవ వందనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అక్కడి దాకా బాగానే ఉన్నా మన అధికారులు జెండా ఏర్పాటు చేసే విషయంలో విమర్శలు వస్తున్నాయి. ఈరోజు విజయవాడలో ఏపీ సిఎం హోదాలో జగన్ జెండా ఎగురవేయడానికి ప్రయత్నం చేస్తే అది కుదరలేదు, రెండు మూడు సారులు లాగినా అది కుదరకపోవడంతో పక్కనే ఉన్న పోలీస్ అధికారి దానిని లాగడం కనిపించింది. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసంలో జెండా ఎగురవేశారు, అక్కడ కూడా జెండా ఎగురక పోవడంతో గట్టిగా లాగడంతో ఏకంగా జెండా కూడా ఊడి చేతిలోకి వచ్చింది. ఈ రెండు ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు ఎలా జెండా కట్టాలో కూడా తెలియకుండా అక్కడ జెండానే కాక ఎగురవేసే వారిని కూడా అవామానిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టుపోస్తున్నారు. ఇప్పటికయినా అధికారులు ఇలాంటి విషయాల మీద ద్రుష్టి పెట్టకుంటే నేటి సోషల్ మీడియా యుగంలో పరువు పోగొట్టుకోవడం ఖాయం.







Untitled Document
Advertisements