అల్లు అర్జున్ మూవీ లో మెగా హీరోయిన్

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 08:44 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అలా వైకుంఠపురంలో టైటిల్ పరిశీలణలో ఉంది. 2020 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో బన్ని సినిమా ఉంది. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, బన్ని చేస్తున్న ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీలో మరో స్పెషల్ న్యూస్ ఏంటంటే కొణిదెల వారసురాలు నిహారిక కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుందట.

ఒక మనసు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం ఇలా చేసిన మూడు సినిమాలు నిరాశపరచాయి. ఇక నిహారిక సినిమాలు ఆపేస్తున్నట్టుగా ప్రచారం వచ్చింది. కాని నిహారిక మాత్రం వరుసగా సినిమాలు ఓకే చేస్తుంది. అల్లు అర్జున్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం నిహారికను అడిగారట. బన్ని స్వయంగా ఈ పాత్రకు నిహారికను రిఫర్ చేశాడట. బన్ని చెప్పాడు కాబట్టి నిహారిక కూడా ఈ సినిమాకు ఓకే చెప్పిందట. మరి అల్లు అర్జున్ సినిమాతో అయినా నిహారికకు హిట్ వస్తుందేమో చూడాలి.





Untitled Document
Advertisements