కశ్మీర్‌పై స్పందించాలని సవాల్...పాకిస్తానీకీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అద్నాన్ సమీ

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 11:39 AM

కశ్మీర్‌పై స్పందించాలని సవాల్...పాకిస్తానీకీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అద్నాన్ సమీ

ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీని ఓ పాక్ వ్యక్తి కశ్మీర్‌పై స్పందించాలని సవాల్ విసిరాడు. ‘‘అద్నాన్ సమీ నీకు దమ్ముంటే కశ్మీర్ సమస్య మీద స్పందించు. ఆ తర్వాత ఇండియాలో నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడు’’ అని ట్వీట్ చేశాడు. దీనిపై అద్నాన్ స్పందిస్తూ.. ‘‘తప్పకుండా.. కశ్మీర్ ఇండియాలో అంతర్భాగం. నీది కానీ విషయాల్లో అనవసరంగా తలదూర్చకు’’ అని బదులిచ్చాడు. మరికొన్ని ట్వీట్లకు సమాధానం ఇస్తూ.. తన తండ్రి ఇండియాలోనే పుట్టారని, ఇండియాలోనే చనిపోయారని తెలిపాడు. తాను ఇండియాలో 17 ఏళ్లు ఉన్నానని, దీంతో తనకు ఇండియన్‌గా మారిపోవాలని అనిపించిందన్నాడు. దీంతో అద్నాన్ సమీ ట్వీట్లు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఇప్పుడు ట్రెండవ్వుతున్న పేరు కూడా ఆయనదే. సమీ సమాధానం చూసి.. ఏం చెప్పావ్ బాసు అంటూ భారత నెటిజన్లు పొగిడేస్తున్నారు. సమీ తండ్రి పాకిస్తానీ, సమీ 1971, ఆగస్టు 15న లండన్‌లో జన్మించాడు. సమీ తండ్రి అర్షద్ సమీ ఖాన్ 1942లో ఇండియాలో జన్మించారు. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌లో స్థిరపడ్డారు. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేశారు. సమీ తల్లి నౌరీన్ ఖాన్ కశ్మీరి. 2001 నుంచి విజిటర్ వీసా మీద సమీ ఇండియాలోనే ఉండేవాడు. 2006లో సమి బరువు 2006 కిలోలకు పెరిగింది. దీంతో వైద్యులు అతను ఇంకా ఆరు నెలలు మాత్రమే బతుకుతాడని చెప్పారు. దీంతో సమి పట్టుదలతో వ్యాయామం, డైట్ పాటిస్తూ కేవలం 16 నెలల్లో 167 కిలోలు తగ్గాడు. 2015లో సమి భారత పౌరసత్వం కోసం ధరకాస్తు చేసుకున్నాడు. 2016 జనవరి 1 నుంచి భారతీయుడిగా జీవిస్తున్నాడు. తెలుగులో శంకర్ దాదా జిందాబాద్, 100% లవ్, ఊసరవెల్లి, ఇష్క్, జులాయి, దేవుడు చేసిన మనుషులు, దేనికైనా రెడీ, గుండె జారీ గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, టెంపర్ సినిమాల్లో పాటలు ఆలపించాడు.
పాకీ ట్వీట్::Adnan sami if you have guts just message on kashmir issue then see tera yeh India tera kia haal karta hai...
అద్నాన్ సమీ ట్వీట్::Sure...Kashmir is an integral part of India. Don’t poke your nose in things that do NOT belong to you!





Untitled Document
Advertisements