వ్యక్తిగత రుణాల్లో ఆకర్షణీయ వడ్డీ రేట్లు

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 12:42 PM

వ్యక్తిగత రుణాల్లో ఆకర్షణీయ వడ్డీ రేట్లు

ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆకర్షణీయ వడ్డీ రేటుకే వ్యక్తిగత రుణాలు అందిస్తోంది. 21- 60 ఏళ్ల మధ్యలో ఉన్న వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ప్రైవేట్, పబ్లిక్ రంగ కంపెనీల్లో పనిచేసే వారు ఎవరైనా రుణం పొందొచ్చు. జాబ్ ఎక్స్‌పీరియన్స్ కనీసం రెండేళ్లు ఉండాలి. అలాగే ప్రస్తుత కంపెనీలో ఏడాది కాలం నుంచి పనిచేస్తూ ఉండాలి. నెలకు కనీసం రూ.15,000 వేతనం పొందాలి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్‌కతా, అహ్మదాబాద్, కొచ్చిన్ వంటి నగరాల్లో నివాసం ఉండే వారి నెలవారీ కనీస వేతనం రూ.20,000కు ఉండాలి. పాస్‌పోర్ట్, ఓటర్ ఐటీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ వంటి ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు కలిగి ఉండాలి. మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్ కూడా కావాలి. ఎంప్లాయిమెంట్ స్టెబిలిటీ, ఆదాయ వనరు, క్రెడిట్ హిస్టరీ, లోన్ రీపేమెంట్ వంటివి వడ్డీ రేట్లను ప్రభావితం చేస్తాయి. వడ్డీ రేటు 15.5 శాతం నుంచి 21.5 శాతం మధ్యలో ఉంది. కొన్ని సందర్భాల్లో తక్కువ వడ్డీకి కూడా రుణం లభించొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పర్సనల్ లోన్ అమౌంట్‌లో 2.5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. రూ.2,500 నుంచి రూ.25 వేల వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటోంది. చెక్ బౌన్స్ అయితే రూ.550 చార్జీలు విధిస్తోంది. లోన్ తీసుకున్న అనంతరం ఏడాది తర్వాతనే లోన్‌ను క్లోజ్ చేసుకోగలం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రుణ మొత్తంలో 25 శాతం వరకు ముందుగా చెల్లించొచ్చు. బ్యాంక్ గరిష్టంగా 4 శాతం వరకు ప్రిపేమెంట్ చార్జీలు వసూలు చేస్తోంది.





Untitled Document
Advertisements