పాలసీ చెల్లించలేక పోతున్నారా...అయితే మీకో తీపి కబురు

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 02:54 PM

పాలసీ చెల్లించలేక పోతున్నారా...అయితే మీకో తీపి కబురు

దేశీయ దిగ్గజ భీమా కంపెనీ ఎల్ఐసీ వినియోగదారులు పాలసీ తీసుకున్నాక ప్రీమియం చెల్లించలేకపోతే తీసుకున్న పాలసీని సంస్థకు సరెండర్ చేయవచ్చు తెలుసా. అయితే ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. కావున పాలసీదారులకు ఇక్కడ మరో ఆప్షన్ అందుబాటులో ఉంది. పాలసీని పెయిడ్ అప్ పాలసీగా మార్చుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించలేక పాలసీని ఆపేయవచ్చు. ఇలాంటప్పుడు మీ పాలసీ ఆటోమేటిక్‌గానే పెయిడ్ అప్ పాలసీగా మారుతుంది. అయితే కనీసం 3 ఏళ్లు ప్రీమియం చెల్లించి ఉండాలి. ఇలా అయితేనే పాలసీ పెయిడ్ అప్ పాలసీగా మారుతుంది. లేదంటే లేదు. పాలసీదారులు.. పెయిడ్ అప్ పాలసీగా కన్వర్ట్ అయిన పాలసీపై డబుల్ యాక్సిడెంట్ కవర్, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ వంటి ప్రయోజనాలు కోల్పోతారు. అలాగే మీరు ఎంత మొత్తానికైతే పాలసీ తీసుకున్నారో.. అంతే మొత్తం రాదు. తక్కువ బీమా మొత్తం లభిస్తుంది. పాలసీ సరెండర్ చేస్తే ఈ మొత్తం కూడా రాదనే విషయాన్ని గుర్తకు పెట్టుకోవాలి. అంతేకాకుండా పాలసీ హోల్డర్ పాలసీని మూడేళ్లకు ముందుగానే సరండర్ చేయాలని భావిస్తే.. ఎలాంటి డబ్బులు రావు. మూడేళ్ల తర్వాత సరెండర్ చేస్తే చెల్లించిన ప్రీమియం మొత్తంలో దాదాపు 30 శాతాన్ని ఎల్ఐసీ మీకు సరెండర్ వ్యాల్యూ రూపంలో అందిస్తుంది. దీనికి కూడా షరతులు వర్తిస్తాయి. ఎలాంటి బోనస్ ఉండదు. అలాగే తొలి ఏడాది ప్రీమియం మొత్తాన్ని లెక్కలోకి తీసుకోరు. అందుకే పాలసీని సంస్థకు తిరిగి ఇచ్చేయాలనే నిర్ణయం మాత్రం దాదాపు తీసుకోవద్దు. ఇకపోతే పెయిడ్ అప్ పాలసీ విషయానికి వస్తే.. ఉదాహరణకు మీరు 25 ఏళ్లకు పాలసీ తీసుకున్నారు. బీమా మొత్తం రూ.10 లక్షలు. 5 ఏళ్లు ప్రీమియం చెల్లించారు. తర్వాత పాలసీ ఆపేశారు. ఇప్పుడు మీ పాలసీ పెయిడ్ అప్ వ్యాల్యూ రూ.2,00,000కు తగ్గుతుంది. అంటే మీకు రూ.10 లక్షలు కాకుండా రూ.2 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. పెయిడ్ అప్ వ్యాల్యూ= చెల్లించిన ప్రీమియాలు/చెల్లించాల్సిన ప్రీమియాలు* సమ్ అస్యూర్డ్ (బీమా మొత్తం).





Untitled Document
Advertisements