ఇకపై నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేది లేదు!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 04:09 PM

ఇకపై నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేది లేదు!

బీసీసీఐ ఇకనుండి టీమ్‌ఇండియా ఆటగాళ్లు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లలో పాల్గొనేందుకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (ఎన్ఓసీ) తాజాగా స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై పాలక మండలిలో చర్చ జరిగిందని, అయితే కెనడా గ్లోబల్‌ టీ20 లీగ్‌లో పాల్గొన్న యువరాజ్‌ సింగ్‌ విషయంలో మాత్రమే మినహాయింపు ఇచ్చారని ఓ అధికారి పేర్కొన్నారు. జరిగిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఇకపై ఏ ఆటగాడికీ ఎన్‌ఓసీను ఇవ్వబోమని ఆయన ఓ ఆంగ్ల పత్రికతో అన్నారని సమాచారం.ఈ విషయంపై నిలకడతత్వం ఉండాలని, కానీ ప్రస్తుత పాలక మండలిలో ఆ స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల కెరీర్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. మరోవైపు టీమ్‌ఇండియాలో రిటైర్మెంట్‌ గురించి ఆలోచించే కొందరు టీ20లీగ్‌లలో ఆడాలనుకుంటున్నారని, మరికొందరు మాజీలు కూడా అందుకు సిద్ధంగా ఉండే అవకాశముందని అన్నారు. పాలకుల కమిటీ తీసుకున్న తాజా నిర్ణయం వారి ఆశలపై నీళ్ల చల్లడమేనన్నారు. ఇంకో అధికారి మాట్లాడుతూ.. రిటైర్మెంట్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా జరగదని.. ఏదైనా దేశం మాజీ ఆటగాళ్లకు టీ20లీగ్‌లలో ఆడే అవకాశం కల్పిస్తే.. అది ఐసీసీ సమస్య అవుతుందని చెప్పుకొచ్చారు.అయితే ఇలాంటి విషయాలను ఐసీసీ పట్టించుకోవట్లేదని చెప్పారు. ఒక ఆటగాడికి అనుమతులు ఇచ్చి తర్వాత మిగతావాళ్లకి ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కచ్చితంగా తప్పేనని అన్నారు. ఇదిలా ఉండగా.. ఆటగాళ్లు విదేశాల్లో టీ 20 లీగ్‌లలో ఆడేందుకు ఎన్‌ఓసిలను ఇవ్వడానికి బీసీసీఐ ఎప్పుడూ ఇష్టపడలేదు, యువరాజ్ విషయంలో మాత్రం పాలకుల కమిటీ మినహాయింపు ఇచ్చింది. అలా ఎందుకు చేశారో కచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉందని ఆ అధికారి చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements