అంతరించిపోనున్న అరటి!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 04:13 PM

అంతరించిపోనున్న అరటి!

ఏ కాలంలోనైనా విచ్చలవిడిగా దొరికే అరటి పండ్లు చౌక ధరలో లభిస్తూ...అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అరటి పండులో శరీరానికి సరిపడా కాల్షియం, ఐరన్ ఉంటుంది. ఇలా మేలు చేసే అరటిపండ్లు భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కావెండిష్ అరటి. దీనికి ప్రపంచంలో మంచి గిరాకీ ఉన్నది.ప్రపంచంలో దాదాపు 1000 కి పైగా అరటి జాతులు ఉంటె అందులో 300 జాతులు మనిషి తినేందుకు అనువుగా ఉంటాయి. అందులోను కావెండిష్ అరటి ప్రత్యేకమైనది. ప్రపంచంలో దీనినే ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ కావెండిష్ అరటిని నాశనం చేసే టిఆర్4 అనే ఫంగస్ స్పీడ్ గా వ్యాపిస్తోంది. అరటి తోటలను సాగు చేసేందుకు వినియోగించే ట్రాక్టర్ టైర్ల ద్వారా, పొలంలో తిరిగే మనిషి బూట్ల ద్వారా ఈ ఫంగస్ వ్యాపిస్తోంది. ఒక్కసారి ఈ వైరస్ అరటి పొలంలోకి వ్యాపించింది అంటే.. పంట మొత్తం నాశనం అయినట్టే. ప్రస్తుతం ఈ ఫంగస్ ను తట్టుకునే విషంగా ఉండే రసాయనాలు పరిశోధన దశలో ఉన్నాయి.





Untitled Document
Advertisements