విద్యార్థులు కులబ్యాండ్స్ కట్టుకోవద్దు!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 04:42 PM

విద్యార్థులు కులబ్యాండ్స్ కట్టుకోవద్దు!

తమిళనాడులో కులబ్యాండ్స్ వివాదం సృష్టించాయి. దీంతో వాటికీ దూరంగా ఉండాలని, వాటిని ధరించడానికి వీలు లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల కులం గుర్తించటానికి చేతులకు బ్యాండ్స్ కట్టుకోవాలని కొన్ని స్కూల్స్ ఆదేశాలు జారీ చేయడంతో నిమ్న కుల సంఘాలు బ్యాండ్స్ ధరించడంపై మండిపడుతున్నాయి. విద్యాశాఖ మంత్రి కెఎ సెంగితయిన్ కుల బ్యాండ్స్‌పై ఇప్పటి వరకు స్పందించలేదు. గత కొన్ని రోజులు నుంచి పాఠశాలలో వివిధ కులాల పిల్లలను గుర్తించడానికి బ్యాండ్స్ ధరించాలని విద్యార్థులకు యజమాన్యాలు సూచించాయి. ఎర్రపు, పసుపు, ఆకుపచ్చ, కుంకుమ పువ్వు రంగు గల బ్యాండ్స్ ధరిస్తే నిమ్న కులాలు, అగ్ర కులాలను గుర్తించవచ్చని కొన్ని పాఠశాల యజమాన్యాలు తెలిపాయి. దీనిపై ఆ రాష్ట్ర విద్యాశాఖ స్పందించింది. ఎవరు బ్యాండ్స్ ధరించవద్దని హెచ్చరించింది. కులం పరంగా బ్యాండ్స్ కట్టుకోవాలని ఏ పాఠశాల యజమాన్యాలు బలవంతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. స్నేహితుల దినోత్సవం, పలు వేడుకలలో మాత్రమే బ్యాండ్స్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కుల పరంగా విద్యార్థులను వేరు చేయొద్దని తమిళనాడు మత్స్య శాఖ మంత్రి డి జయకుమార్ ఆ పాఠశాలలకు తెలియజేశారు. అన్ని కులాల వారి కోసం తమిళనాడు ప్రభుత్వం పని చేస్తోందని ఆయన వివరించారు.





Untitled Document
Advertisements