బాలీవుడ్ సినిమాపై కన్నేసిన నాని

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 05:13 PM

నాచురల్ స్టార్ నాని సెప్టెంబర్ లో గ్యాంగ్ లీడర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఇంద్రంగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు నాని. ఈ రెండు సినిమాల తర్వాత ఓ బాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అంధధూన్ సినిమా రీమేక్ పై నాని కన్నేశాడని తెలుస్తుంది. శ్రీరాం రాఘవన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించింది.

ఈమధ్య ఎక్కువగా తెలుగు సినిమాలు హిందిలో రీమేక్ అవుతుండగా బాలీవుడ్ సినిమా తెలుగులో రీమేక్ అవడం విశేషం. రీసెంట్ గా ఈ సినిమాకు బెస్ట్ మూవీ.. సినిమా హీరో ఆయుష్మాన్ ఖురానాకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డులు వచ్చాయి. అందుకే నాని ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తెలుగులో నాని హీరోగా.. తమిళంలో సిద్ధార్థ్ తో ఈ సినిమాను ఓ బడా నిర్మాణ సంస్థ రీమేక్ చేయనుందట. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి.





Untitled Document
Advertisements