కేజీ బంగారంతో ప్రైవేటు జెట్ కొనొచ్చు!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 05:57 PM

కేజీ బంగారంతో ప్రైవేటు జెట్ కొనొచ్చు!

పసిడి ధర తాజాగా భారీ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.39,000 స్థాయికి చేరుకుంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో.. ‘1990లో కేజీ బంగారం ధరతో మారుతీ 800 కారు కొనొచ్చు. 2000లో కేజీ బంగారం ధర మారుతీ ఎస్టీమ్‌కు సమానమైంది. 2005లో ఇదే బంగారం ధరతో ఇన్నోవా కారు కొనొచ్చు. 2010లో కేజీ పసిడి ధర ఫార్చ్యూన్ కారు ధరకు, 2016లో బీఎండబ్ల్యూ కారు ధరకు ఈక్వల్ అయ్యింది. 2019లో కేజీ బంగారంతో వోల్వో ఎస్60 కారు కొనేయవచ్చు. అందువల్ల కేజీ బంగారం మీ వద్ద ఉంచుకోండి. 2030 వరకు వేచిచూడండి. అప్పుడు ఏకంగా ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయవచ్చు. అందువల్ల మీ భార్య బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అడిగితే దయచేసి కాదనకండి’ అని పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ పిక్ నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ నెటిజన్ కేవలం నవ్వుకోడానికి పెట్టి ఉండచ్చు కానీ అదే నిజం. బంగారం ధర రోజు రోజుకి పైపైకి ఎగురుతుంది తప్ప దిగడం లేదు.





Untitled Document
Advertisements