శాస్త్రి రీఅపాయింట్...2021 వరకు కోచ్‌గా

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 06:49 PM

శాస్త్రి రీఅపాయింట్...2021 వరకు కోచ్‌గా

శుక్రవారం టీమిండియా హెడ్ కోచ్‌ను ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి ప్రకటించారు. కొన్ని వారాలుగా జరుగుతున్న ఎంపిక ప్రక్రియలో రవి శాస్త్రినే మళ్లీ జాతీయ జట్టుగా ఎంపిక చేశారు. ఇంటర్వ్యూలు మొదలుపెట్టకముందే అతనిపై ఫేవరేట్ గా కనిపించింది వాతావరణం.కెప్టెన్ కోహ్లీ కూడా తమకు రవిశాస్త్రితో చాలా మంచి బంధం ఏర్పడిందని అతనే మళ్లీ కోచ్ అయితే బాగుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. 2021 టీ20 వరల్డ్ కప్ వరకూ కోచ్ పదవిలో రవిశాస్త్రినే కొనసాగుతారు. శుక్రవారం జరిగిన ఇంటర్వ్యూలో ముందుగా భారత మాజీ ఆల్ రౌండర్ రాబిన్ సింగ్‌ను పరీక్షించారు. ముంబై ఇండియన్స్ జట్టుకు కోచ్‌గా పనిచేసిన అనుభవం సింగ్‌కు ఉంది.హెడ్ కోచ్ పదవికి ఆరుగురు పోటీపడగా వారిలో రవిశాస్త్రి పేరే టాప్ గా వినిపించింది. రవి శాస్త్రి, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్, మైక్ హస్సెన్, టామ్ మూడీ, ఫిల్ సిమ్మోన్స్‌లు హై ప్రొఫైల్ జాబితాలో ఉన్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ జట్టుకు మేనేజర్‌గానూ సింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.





Untitled Document
Advertisements